Type Here to Get Search Results !

భారతదేశ సంప్రదాయ నృత్యాలు - Indian Traditional Dances

0

సంప్రదాయ నృత్యాలు

కూచిపూడి :
కూచిపూడి ఆంద్రప్రదేశ్ లో బాగా ప్రచారంలో ఉన్న నాట్యం.కూచిపూడి ఆంధ్రప్రదేశ్ లోని కుచేలపురం అనే గ్రామంలో అవతరించింది.సాధారణంగా దీనిని ఒక్కరే అభినయిస్తారు.తీర్థ నారాయణ,సిద్దేంద్రయోగి అనేవారు ఈ శైలిని రూపొందించారు.

కథక్ :
ఈ నాట్యం ఉత్తర భారతదేశంలో బాగా బాగా ప్రసిద్ధి చెందింది.కథక్ అనే పదం కథ అనే పదం నుండి ఉద్భవించింది.దీనిని స్త్రీ,పురుషులిరువురు ప్రదర్శిస్తారు.




మణిపురి :
ఇది ఈశాన్య ప్రాంతంలో ముఖ్యంగా మణిపూర్ లో బాగా ప్రాచుర్యంలో ఉన్న నాట్యం.ఈ నాట్యంలో రాధా-కృష్ణుడు గోపికల కధాంశాలను ఎక్కువగా ప్రదర్శించడం జరుగుతుంది.

భరతనాట్యం :
దృశ్య కళల్లోభరతనాట్యానికి ప్రముఖ స్థానం ఉంది.ఇది దక్షిణ భారతదేశం లోని దేవాలయాలలో ఆవిర్భవించింది.భరతనాట్యం తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొందింది.

ఒడిస్సీ :
ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నాట్య రూపం.జైన రాజు ఖారవేలుడు పాలించిన క్రీ.పూ రెండవ శతాబ్దంలో ఈ నాట్య రూపం అభివృద్ధి చెందింది.

కథాకళి :
ఇది కేరళ రాష్ట్రానికి చెందిన నాట్య రూపం.ఇది కేరళ లోని రాజాస్థానాలలో అవతరించింది.

మోహినీ అట్టం :
ఇది కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది.దీనిని ఒక వ్యక్తీ మాత్రమే అభినయిస్తాడు.





నృత్యము =  = = = ప్రాంతం
1.కూచిపూడి == ఆంధ్రప్రదేశ్
2.కథక్ == ఉత్తర భారతదేశం
3.మణిపురి == మణిపూర్
4.భరతనాట్యం == తమిళనాడు
5.ఒడిస్సీ== ఒడిశా
6.కథాకళి, మోహినీ అట్టం == కేరళ    

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad