Type Here to Get Search Results !

Munaga Leaf Health Benefits - మునగ ఆకు ప్రయోజనాలు - Health Tips in Telugu

0

ఆషాడం వచ్చిందంటే చాలు. మునగ ఆకు కోసం ప్రయత్నిస్తుంటారు. అసలు ఆ సమయంలో మునగ ఆకు ఎందుకు స్వీకరిస్తారు.... దానివల్ల కలిగే మేలు ఏంటో చూద్దాము.మునగ ఆకును ఒక్క ఆషాడం లోనే కాదు. ఏడాది పొడుగునా తీసుకొచ్చు. చిరు చేదుగా ఉంటే మునగఆకులో పిండి, కొవ్వు, పదార్దములు తక్కువగా , పీచు పదార్ధము ఎక్కువగా ఉంటుంది. ఎ, సి, విటమిన్లు , ఇనుము, క్యాల్సియం , పొటాషియం, తదితరాలు సంవృద్దిగా ఉంటాయి... అయితే ఈ కుర అరగడానికి రెండు గంటలు పడుతుంది.

పచ్చి ఆకును శుబ్రంగా కడిగి రసం తీసుకొని స్వికరించ్చావచ్చు. సర్వరోగ నివారిణి. అమ్రుతపానీయం అనదగ్గ ఈ ఆకును ఎలా స్వీకరించాలంటే.....మునగాకును మెత్తగా నూరి, మరుగుతున్న నీటిలో వేసి, మూత పెట్టి ఇదు నిమిషాలు తర్వాత దింపేయాలి. కాస్త చల్లారక వడకట్టి ఉప్పు , మిరియాల పొడి చేర్చి, సూపు లాగ తీసుకోచ్చు.మునగాకు రసం , తేనె, కొబ్బరినీరు, కలిపి చిన్నకప్పు చొప్పున రోజు రెండు , మూడు సార్లు తీసుకుంటే నీళ్ళ విరేచనాలు , రక్త విరేచనాలు, కాలేయ సమస్యలు తగ్గుతాయి.

కామెర్లు ఉన్నవారు చెంచా మునగాకు రసాన్ని, రెండు చెంచాల కొబ్బరినీటిలో కలిపి ఓ వారం పాటు క్రమం తప్పకుండ తీసుకుంటే త్వరగా కోలుకుంటారు.కునగాకు రసంలో చిటికెడు ఉప్పు, మిరియాలపొడి,నిమ్మరసం వేసి పరగడుపున పుచ్చుకుంటే బడలిక ,జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతాయి.పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి మునగాకు రసం తోడ్పడుతుంది.నెలసరి సక్రమంగా రానివారు , కాల్సియం తగ్గినవారు చిన్న కప్పు పాలకు పెద్ద చెంచా మునగాకు రసం కలిపి రోజు తీసుకోవాలి.

మూత్రంలో మంట , ఉష్నతత్వం ఉన్నవారు మునగాకు.... క్యారెట్ దోసకాయలను రసంల చేసి రోజు ఓ గ్లాసు తీసుకుంటే ఫలితం ఉంటుంది.అధిక బరువు , మధుమేహం ఉన్నవారు ఎండాబెట్టిన మునగాకుపొడిని తేనెతో కలిపి చెంచా చొప్పున రోజు భోజనానికి ముందు తీసుకోవాలి.మునగాకు రసంలో చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
జాగ్రతలు : మునగాకులను ఎక్కువగా తీసుకోకూడదు. వేడి చేస్తుంది.
విరుగుడు : పెరుగు, మజ్జిగ, వాము.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad