Type Here to Get Search Results !

How Apply YSR Law Nestham Scheme in Andhra Pradesh || YSR లా నేస్తం పథకానికి ఎలా అప్లై చేయాలి

0
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్య మంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి మరొక హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. ఓ వైపు హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాయర్లు ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. ఇవన్నీ పక్కకు పెట్టి జూనియర్ లాయర్ల (అడ్వకేట్)కు నెలకు రూ. 5000 చొప్పున స్టెఫండ్ ఇచ్చేందుకు వైయస్ సర్కార్ సిద్ధమైంది. నవంబర్ 2వ తేదీన పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలకు ఆయన ఆమోదం తెలిపారు.

ఈ విధి విధానాలు ఏంటో ఒక సారి చూద్దాం....!
1) దరఖాస్తుదారు లా గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి.
2) దరఖాస్తుదారు పేరు రాష్ట్ర బార్ కౌన్సిల్ సెక్షన్ 17 న్యాయవాద చట్టం 1961 ప్రకారం రోల్స్ లో నమోదై ఉండాలి.
3) కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
4) న్యాయవాద చట్టం 1961 సెక్షన్ 22 ప్రకారం రోల్ లో నమోదైన తొలి మూడేళ్ల ప్రాక్టీసు సర్టిఫికెట్ ను పరిగణనలోకి తీసుకుంటారు.
5) జీవో జారీ అయ్యే నాటికి జూనియర్ లాయర్లు ప్రాక్టీసు ప్రారంభించి తొలి మూడేళ్లు పూర్తి కాకపోతే మిగిలిన సంవత్సరాలకు స్టెఫండ్ కు అర్హులు.
6) 15 ఏళ్ల ప్రాక్టీసు అనుభవం కలిగిన సీనియర్ న్యాయవాదులు లేదా సంబంధిత బార్ అసోసియేషన్ నుంచి ధృవీకరణ పత్రంతో ప్రాక్టీసులో క్రియాశీలకంగా ఉన్నట్లు ప్రతి ఆరు నెలలకు జూనియర్ అడ్వకేట్స్ అఫిడవిట్‌ను సమర్పించాలి.
7) న్యాయవాద వృత్తి నుంచి వైదొలిగినా, ఏదైనా మెరుగైన ఉద్యోగం వచ్చినా.. ఆ వివరాలను ఆన్లైన్ ద్వారా సంబంధిత అధికారులకు తెలియజేయాలి.
8) బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న తర్వాత రెండేళ్ల వరకు వారి సర్టిఫికెట్లు బార్ కౌన్సిల్ లో ఉంచాలి.
9) కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తింప చేస్తారు. కుటుంబం అంటే భర్త, భార్య, మైనర్ పిల్లలు.
10) ప్రతి దరఖాస్తు దారు ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
11) జీవో జారీ చేసేనాటికి జూనియర్ న్యాయవాది 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి.
12) జీవో జారీ అయ్యే నాటికి తొలి మూడేళ్ల ప్రాక్టీసు పూర్తి అయి ఉంటే అనర్హులు. 
13) జూనియర్ న్యాయవాది పేరు మీద నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు.
14) నాన్ ప్రాక్టీసు న్యాయవాదులు అనర్హులు.
15) అర్హులు వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
16) లా డిగ్రీతో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అప్ లోడ్ చేయాలి.
17) సీనియర్ న్యాయవాది ధృవీకరణతో బార్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ అయినట్లు అఫిడవిట్ అప్లోడ్ చేయాలి.
18) దరఖాస్తుతో పాటు ఆధార్ నంబర్‌ను పొందుపరచాలి.
19) దరఖాస్తు దారు బ్యాంక్ ఖాతా వివరాలను తెలియజేయాలి.
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad