Type Here to Get Search Results !

ఇతర రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీ వర్తించే 716 సూపర్ స్పెషలిటీ ఆసుపత్రుల జాబితా | Aarogyasri Other States Hospital List inTelugu

0
దివంగత నేత శ్రీ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మానస పుత్రిక అయిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో ఖరీదయిన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ వచ్చారు. కానీ ఈ ఆరోగ్య శ్రీ ఇప్పటివరకు మన రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు మాత్రమే పరిమితం అయింది. గుండె, లివర్, కిడ్నీ తదితర ప్రాణాంతక రోగాలకు మన ఆంధ్రప్రదేశ్ లో తగిన వైద్య సదుపాయాలు లేవు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహా నగరాలలో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి కానీ మధ్య తరగతి కుటుంబాలకు అక్కడికి వెళ్లి వైద్యం చేయించుకోవడం ఆర్థిక స్తొమత లేక చాల మంది ఇబ్బందులు పడేవారు.

ఇప్పుడు ఆయన కుమారుడు ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ  ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత విస్తృతం చేస్తూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

వెయ్యి రూపాయలు పైబడితే ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందజేస్తామని ఏపీ సీఎం జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని అమలు చేయడంలో భాగంగా అదనపు వ్యాధులను పథకంలో చేర్చారు. అలాగే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు అవకాశం కల్పిస్తూ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇతర రాష్ట్రాల ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. వచ్చే నెల (నవంబర్‌) 1 నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉన్న 150 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం వైద్యసేవలను అందుబాటులోకి తెస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ మేరకు ఇతర రాష్ట్రాలలోని సుమారు 716 సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులలో మనం ఆరోగ్యశ్రీ క్రింద ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు.. ఆ ఆసుపత్రుల జాబితా క్రింద లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మీ బందువులకు, స్నేహితులకు షేర్ చేసి ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియచేస్తారని కోరుకుంటూ.

మీ 
పసుపులేటి మల్లికార్జున 
CEO & Admin
www.namastekadapa.com
www.kadapajobs.in



Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad