Type Here to Get Search Results !

మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా? అయితే మీకో శుభవార్త

0
మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా? అయితే మీకో శుభవార్త. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా mAadhaar యాప్ ను సరికొత్తగా మార్చేసింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్ లో కొత్త వర్షన్ రిలీజ్ చేసింది. మీరు mAadhaar యాప్ ఉపయోగిస్తున్నట్లైతే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లో కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 5.0, ఐఓఎస్ 10.0 కన్నా ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నవారికి కొత్త ఎంఆధార్ యాప్ పనిచేస్తుంది.

యూజర్లు పాత యాప్ డిలిట్ చేసి కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అద్భుతమైన ఫీచర్లు పొందొచ్చు. ఎంఆధార్ యాప్ 13 భాషల్లో ఉపయోగించొచ్చు. ఆధార్ ఉన్నవారు మాత్రమే కాదు... లేనివాళ్లు కూడా తమ స్మార్ట్ ఫోన్లల్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఆధార్ యాప్ ఓపెన్ చేయగానే 'Main Service Dashboard', 'Request Status Services', 'My Aadhaar' లాంటి సేవలుంటాయి. ఎంఆధార్ యాప్ లో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

రీప్రింట్, అడ్రస్ అప్ డేట్, ఇకేవైసీ డౌన్లోడ్, స్కాన్ క్యూఆర్ కోడ్, వెరిఫై ఆధార్, వెరిఫై ఇమెయిల్, రిట్రీవ్ యూఐడీ | ఈఐడీ, అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ లాంటి సేవలుంటాయి. ఎంఆధార్ యాప్ ద్వారా మీ ఆధార్ లేదా బయోమెట్రిక్ ఆథెంటికేషన్‌ను లాక్ లేదా అలాక్ చేయొచ్చు. ఒక ఆధార్ యాప్ లో ఒకరి వివరాలు మాత్రమే కాదు... మూడు ప్రొఫైల్స్ యాడ్ చేయొచ్చు. ఎంఆధార్ యాప్ ఆఫ్ లో పనిచేయదు. ఇంటర్నెట్ ద్వారానే పనిచేస్తుంది. ఐడీ ప్రూఫ్ ను చూపించాలంటే ఎంఆధార్ యాప్ ద్వారా చూపించొచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఎంఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోండి.
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad