Type Here to Get Search Results !

How to Start Coir Industry Business (Telugu) | Local Small Telugu Self Employment

0
మనసు పెట్టి ఆలోచిస్తే సొంత ఊరిలోనే అధిక ఆదాయం వచ్చే వ్యాపారాలు  చాలానే ఉన్నాయి. అందులో ఒకటి కొబ్బరి పీచు పరిశ్రమ అంటే (Coir industry). ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడం  ద్వారా మీరు మీ ఊరిలో ఉండే  చదువుకొని మహిళలకు అలాగే చదువుకుని ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువతకు మీరే ఉపాధి కల్పించవచ్చు. నీడపట్టున ఉండే పని, అందునా ఏడాది పొడవునా పని ఉంటుంది కాబట్టి చాలా మంది ఇందులో పనిచేయడానికి  ఆసక్తిని చూపుతారు.
ఈ కొబ్బరి పీచును ఎందుకు ఉపయోగిస్తారు అంటే  రెడీమేట్ పరుపులు, సోఫాలు , తల దిండులు, రైలు, బస్సు, కారు వంటి వాహనాల సీట్ల తయారీకి,  తివాచీలు, మన ఇంట్లో కాళ్లు తుడుచుకొనే పట్టలు.. కూలర్ లకు, కార్లు, ఇళ్ళకు తెరలుగా వాడేందుకు ఇలా ఈ కొబ్బరి పీచును చాల రకాలుగా ఉపయోగిస్తారు, అందుకే కొబ్బరి పీచుకు అంత డిమాండ్ ఉంటుంది, అంతర్జాతీయంగా కూడా కొబ్బరి పీచు ఎగుమతి అవుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad