Type Here to Get Search Results !

ఈ రోజు (19-10-2022) రాశి ఫలితాలు

0


మేషం


 19-10-2022



వ్యాపార, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తప్పవు. కొన్ని పనులలో శ్రమ తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటాబయట ఊహించని వివాదాలు కలుగుతాయి. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 

 


---------------------------------------


వృషభం

 

 19-10-2022



 కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు.



---------------------------------------


మిధునం


 19-10-2022



 విద్యార్థులకు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.



---------------------------------------


కర్కాటకం

 

 19-10-2022



వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.



---------------------------------------


సింహం


 19-10-2022


 

 నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభ సాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణకు అవకాశములు అందుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.



---------------------------------------


కన్య

 

 19-10-2022



సన్నిహితులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి,వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది.



---------------------------------------


తుల


 19-10-2022


 

స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. దాయదులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందుతారు. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.



---------------------------------------


వృశ్చికం


 19-10-2022


 

బంధువులతో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. ఉదర సంభంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున నిరాశ తప్పదు. మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.



---------------------------------------


ధనస్సు


 19-10-2022


 

సోదరులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో ఇతరలతో అప్రమత్తంగా వ్యవహారించాలి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు వలన మానసిక సమస్యలు కలుగుతాయి.



---------------------------------------


మకరం


 19-10-2022


 

 ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.



---------------------------------------


కుంభం

 

 19-10-2022



సోదరులతో స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.



---------------------------------------


మీనం


 19-10-2022


 

 ఇంటాబయట కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగయత్నాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad