Type Here to Get Search Results !

జనవరి 1వ తేదీనే కొత్త సంవత్సరంగా ఎందుకు జరుపుకొంటారో తెలుసా...

0

నూతన సంవత్సరం జనవరి 1వ తేదీనే ఎందుకు ప్రారంభం అవుతుంది? ఈ రోజునే ఎందుకు వేడుకలు జరుపుకోవాలి? అనే ప్రశ్న చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది. అందుకే నూతన సంవత్సరం వెనుక ఉన్న చరిత్ర ప్రత్యేక కథనం మీకోసం..

నూతన సంవత్సరం జనవరి 1వ తేదినే ఎందుకు జరుపుకుంటారనే దానికి సమాధానం కావాలంటే 2000 సంవత్సరాల వెనక్కు వెళ్లాల్సిందే. క్రీస్తుపూర్వం 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయం ఆధారంగా దీన్ని రూపొందించారు. అయితే భూమి రోజులో ఒకసారి తన చుట్టూ తాను కూడా తిరుగుతుంటుంది. కాబట్టే రోజూ ఒకసారి సూర్యోదయం, సూర్యాస్తమయం అవుతుంటాయి.

క్యాలెండర్‌ను ప్రవేశపెట్టేప్పుడు సంవత్సరాన్ని మొదలు పెట్టే రోజును సీజర్ ఎంచుకోవాల్సి వచ్చింది. రోమన్లకు జనవరి నెల ప్రముఖమైనది. ఎందుకంటే వారి దేవత జనస్ పేరిట ఏర్పడిన నెల అది. రోమన్లు తమ అధికారాన్ని విస్తరించిన కొద్దీ వాళ్ల రాజ్యంతో పాటు క్యాలెండర్ కూడా ఆయా ప్రాంతాలకు చేరింది. ఇంగ్లండ్ మాత్రం 1752వ సంవత్సరం వరకూ కొత్త సంవత్సర దినోత్సవాన్ని మార్చి 25నే జరుపుకొంటూ వచ్చింది. అయితే, 1752లో దేశ పార్లమెంటు ఒక చట్టం తీసుకువచ్చి, యూరప్‌తో పాటుగా ఇంగ్లండ్ కూడా కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకునేట్లు చేసింది. ప్రస్తుతం చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్‌నే ఉపయోగిస్తున్నాయి. అందుకే ప్రతి ఏటా జనవరి 1వ తేదీన కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడం ఆనవాయతీగా మారింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad