Type Here to Get Search Results !

Rubber Stamp Making Business - Business Ideas Telugu

0

"రబ్బర్ స్టాంపు" ముద్ర. ఇది లేనిదే ఏ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయంలోనూ పనులు జరగవు. ఈ రబ్బరు స్టాంప్ ముద్ర ఉంటేనే ఆ పత్రాలకు విలువ ఉంటుంది. శతాబ్దాలుగా పలు అవసరాల దృష్ట్యా ఈ రకమైన రబ్బర్ స్టాంపులను వినియోగిస్తున్నా నేటికీ వాటి అవసరం ఉండనే ఉంటుంది. ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు, చిన్న చిన్న ఆఫీస్ లు, సూపర్ మార్కెట్ లు, కిరానా స్టోర్ లు, డాక్టర్స్, లాయర్లు , ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ లు ,ఇలా ప్రతిచోటా వీటి అవసరం ఉంటుంది.  ఇంతలా మన జీవితాలను ప్రభావితం చేస్తున్న ఈ రబ్బర్ స్టాంప్ తయారీని ఆదాయవనరుగా మార్చుకుని మంచి లాభాలను సంపాదించుకోవచ్చు. 

గతంలో రబ్బర్ స్టాంపులను తయారు చేయడానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పట్టేది. మాన్యువల్ పద్ధతిలో అక్షరాలు కలిగిన ఇనుప చువ్వలను వినియోగించి వాటికి అచ్చు పోసి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా మంటపై కాల్చి స్టాంప్ అక్షరాలు తయారు చేసేవారు. 

ఈ పద్దతిలో స్టాంప్ తయారు చేసేందుకు ఎక్కువ శ్రమ, అధిక సమయం పెట్టేది. ఇప్పుడు ఆ పద్ధతి పూర్తిగా మారిపోయింది. టెక్నాలజీని వినియోగించుకొని కేవలం ఒకే ఒక చిన్న మిషన్ సహాయంతో  ఐదు నిమిషాల్లోనే ఒక స్టాంపును తయారు చేసి ఇవ్వవచ్చు.  

రబ్బర్ స్టాంపుల్లో వివిధ రకాలు ఉన్నాయి. ప్రీ ఇంక్ అనే స్టాంప్‌కు ఇంకు అవసరం లేదు. అందులోనే ఇంకు ఉండడంతో నేరుగా ముద్ర వేసుకోవచ్చు. ఇటువంటి స్టాంప్ తయారీకి ఒక గంట సమయం పడుతుంది. మరొకటి సాధారణ రబ్బర్ స్టాంపు. గతంలో ఇటువంటి స్టాంపు తయారీకి మాములుగా అయితే ఒక రోజు పడుతుంది. ఈ చిన్న మిషన్ సహాయంతో మనం ఎంచుకున్న స్టాంపు రకాన్ని బట్టి కేవలం 5 నిముషాల్లో రబ్బర్ స్టాంపు తయారు చేసుకోవచ్చు. 

ఈ రబ్బర్ స్టాంపుల తయారీ వ్యాపారాన్ని మీ ఇంట్లోనే కేవలం  ఒకే ఒక చిన్న మిషన్ సహాయంతో కేవలం 20 వేలరూపాయల పెట్టుబడితో  స్టార్ట్ చేయవచ్చు. 

ఈ బిజినెస్ లో అవసరమైన వస్తువుల విషయానికి వస్తే రబ్బర్ స్టాంపుల తయారీకి పాలిమర్ రబ్బర్ స్టాంప్ మేకింగ్ మిషన్ కావాలి, ఈ మిషన్ తో మీరు దాదాపు అన్ని రకాల రబ్బర్ స్టాంపులను తయారు చేసుకోవచ్చు అలాగే  రబ్బర్ స్టాంప్ హ్యాండిల్స్, మరియు సిరా కావలసిఉంటుంది. ఈ మిషన్ మరియు రబ్బర్ స్టాంప్ హ్యాండిల్స్ మీకు ఇండియా మార్ట్ వెబ్సైట్ లో లభిస్తాయి. 

అయితే ఈ బిజినెస్ లో ఉన్న రిస్క్ విషయానికి వస్తే ఈ రబ్బర్ స్టాంపులను మనం ఎవరికీ పడితే వారికీ తయారు చేసి ఇవ్వకూడదు. మీకు ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ ఒక ప్రభుత్వ ఆఫీస్ కి సంబందించిన వ్యక్తి అయితే అతని నుంచి పర్మిషన్ లెటర్ లేదా లెటర్ హెడ్ తీసుకోవాలి. ఇలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

ఈ బిజినెస్ కి మార్కెటింగ్ విషయానికి వస్తే వార్తా పత్రికలూ, ఇంటర్నెట్ , సామజిక మాధ్యమాల ద్వారా మీ బిజినెస్ ని మార్కెటింగ్ చేసుకోవాలి. అలాగే మీ పట్టణంలో ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు, చిన్న చిన్న ఆఫీస్ లు, సూపర్ మార్కెట్ లు, కిరానా స్టోర్ లు, డాక్టర్స్, లాయర్లు , ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ లు ,  బుక్స్ మరియు స్టేసీనరీ షాపుల వారిని కలిసి విజిటింగ్ కార్డు లాంటిది ప్రింట్ చేయించి వారికీ ఇవ్వాలి. ఇలా మెల్లగా మార్కెటింగ్ చేసుకుంటే ఈ బిజినెస్ లో ఎక్కువ లాభాలను సంపాదించుకోవచ్చు.


 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad