Type Here to Get Search Results !

మీరు డబ్బును పొదుపు చేయాలి అనుకుంటున్నారా? ఇలా చెల్లిస్తే కోటి మీ సొంతం...

0

ఎలాగైనా కోటి రూపాయలు పొదుపు చేయాలనుకుంటున్నారా? ఎందులో ఇన్వెస్ట్ చేయాలో అర్థం కావట్లేదా? పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPF గురించి మీకు తెలుసా? ఇది డబ్బును పొదుపు చేయడానికి ఓ మార్గం. ట్యాక్స్ సేవింగ్స్ కోసం పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. గత ఐదేళ్లుగా పీపీఎఫ్ వడ్డీ రేటు సుమారు 8 శాతం ఉంది. భవిష్యత్తులో ఈ వడ్డీ రేటు మారొచ్చు. అయితే పీపీఎఫ్‌ వడ్డీ రేటు 7.9 శాతం అనుకుంటే రూ.1 కోటి రిటర్న్స్ రావాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలన్న సందేహాలు చాలామందిలో ఉంటాయి. పీపీఎఫ్ వడ్డీని ఏటా లెక్కిస్తారు కాబట్టి చక్రవడ్డీ కలిసొస్తుంది. మరి రూ.1 కోటి సేవింగ్స్ కోసం ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోండి.

పీపీఎఫ్ అకౌంట్ 25 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే మీరు తక్కువ మొత్తంతో పొదుపు ప్రారంభించొచ్చు. నెలకు కేవలం రూ.5,000 చొప్పున 35 ఏళ్ల పాటు పొదుపు చేయాలి. వడ్డీ 7.9 శాతంగా లెక్కిస్తే మీకు రూ.1 కోటి రిటర్న్స్ వస్తాయి. అంటే ఏటా రూ.60,000 పొదుపు చేస్తే 35 ఏళ్లలో రూ.1 కోటి రిటర్న్స్ పొందొచ్చు. అదే ఏటా రూ.1.5 లక్షల చొప్పున 35 ఏళ్లు పొదుపు చేస్తే రూ.2.7 కోట్లు రిటర్న్స్ పొందొచ్చు. తక్కువ వయస్సులో పొదుపు ప్రారంభించడం వల్ల ఉపయోగమిదే.

ఇక 30 ఏళ్ల వయస్సులో పీపీఎఫ్ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేసినా రూ.1 కోటి రిటర్న్స్ పొందొచ్చు. అయితే ఇందుకోసం కాస్త ఎక్కువ మొత్తంలో పొదుపు చేయాల్సి ఉంటుంది. నెలకు సుమారు రూ.7,200 చొప్పున 30 ఏళ్ల పాటు పొదుపు చేస్తే ఏటా 7.9 శాతం వడ్డీ చొప్పున రూ.1 కోటి రిటర్న్స్ పొందొచ్చు. అంటే ఏడాదికి రూ.60,000 సేవింగ్స్ చేస్తే 30 ఏళ్లలో మీకు రూ.1 కోటి వస్తాయి. అదే ఏడాదికి రూ.1.5 లక్షల చొప్పున పొదుపు చేస్తే రూ.1.8 కోట్ల రిటర్న్స్ పొందొచ్చు.

ఇలాంటి మరెన్నో స్కీమ్స్ ద్వారా డబ్బును పొదుపు చేసుకోవచ్చు. మరి మీరేం అనుకుంటున్నారో కింది కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియచేయండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad