Type Here to Get Search Results !

ప్రపంచ జల దినోత్సవం మార్చి 22 ~ Charitralo Ee Roju

0
ప్రపంచ జల దినోత్సవం : మార్చి 22

ప్రపంచ జల దినోత్సవాన్ని మార్చి 22,  పాటిస్తారు. మంచి నీటి ప్రాధాన్యతను ప్ర జలకు తెలియచేసేందుకు యునైటెడ్ నేషన్స్ మార్చి 22వ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా నిర్వహిస్తుంది. మెరుగైన నీటి వనరుల ఉపయోగం, జల వనరుల సంరక్షణ ప్రపంచ జల దినోత్సవ ముఖ్యోద్దేశం.

నీరు, శక్తి మరియు వీటి మధ్య గల అవినాభావ సంబంధానికి గుర్తుగా, 2014వ సంవత్సర ప్రపంచ జల దినోత్సవ ఇతివృత్తంగా (థీమ్) జలము-శక్తి (Water and Energy)గా యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది.

ఈ రోజున యునైటెడ్ నేషన్స్, టోక్యోలో యుఎన్-వాటర్ డికేడ్ ప్రోగ్రాం ఆన్ అడ్వోకసీ అండ్ కమ్యూనికేషన్స్ పై జర్నలిస్ట్ వర్క్‌షాప్ ను నిర్వహించి వరల్డ్ వాటర్ డెవలప్‌మెంట్ నివేదికను విడుదల చేసింది మరియు ఈ రోజున వాటర్ ఫర్ లైఫ్ అవార్డుల ప్రకటన మరియు కీలకోపన్యాసాల కార్యక్రమాలు జరిగాయి.

భూభాగంలో 70.9 శాతం నీటితో నిండి వుంది. అందులో 86.5 శాతం సముద్రపు నీరు, 1.7 శాతం భూగర్భ జలాలు, 1.7శాతం మంచు రూపంలో ఉంది. అయితే భూమిమీద మొత్తం 2.5 శాతం మాత్రమే మంచినీరు ఉంది. అందులో 0.3 శాతం నదుల్లో, కాలువల్లో ఉంది.

యునైటెడ్ నేషన్స్, ప్రపంచ జల దినోత్సవాన్ని 1992 యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ (UNCED), రియో డి జెనీరియో సమావేశంలో ప్రతిపాదించింది. దీన్ని 1993వ సంవత్సరం నుంచి నిర్వహించడం ప్రారంభించారు. 

మెరుగైన మంచి నీటి వనరుల నిర్వహణ, ప్రాముఖ్యత పట్ల అవగాహనా కల్పించడంకోసం యునైటెడ్ నేషన్స్ ప్రతి సంవత్సరం మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవంగా జరుపుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad