Type Here to Get Search Results !

ఎన్నికల కోడ్ అంటే ఏమిటో తెలుసుకోండి ~ What is Election Code in Telugu

0
Dear friends ....
ఎన్నికల కోడ్ అంటే ఏమిటో తెలుసుకోండి.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి - Model Code of conduct.
ప్రవర్తనా నియమావళినే ఆంగ్లంలోModel Code of conduct(MCC) అంటారు. ఒక వ్యక్తి లేదా సంస్థ లేదా రాజకీయపార్టీ ఎలా ప్రవర్తించాలన్నదానిపై ఏర్పాటు చేసిన నియమాళియే ఇది.

ఎన్నికల సందర్భంగా రాజకీయపార్టీల, పోటీలో ఉన్న అభ్యర్ధుల, ప్రజల, ఉద్యోగుల నైతిక ప్రవర్తన గురించి కొన్ని నియమావళులను కేంద్ర ఎన్నికల సంఘంవారు ఏర్పాటుచేసి, వీటిని సక్రమ అమలు పరిచేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు.

 స్ధూలంగా చెప్పాలంటే ఎన్నికల అక్రమాలు నిరోధించేటందుకు కేంద్ర ఎన్నికల సంఘంవారు(Election Commission of India)  రాజకీయపార్టీలకు, అధికారంలో వున్న ప్రజా ప్రతినిధులకు, అభ్యర్ధులకు, ప్రజలకు, ఉద్యోగులకు ఈ పని చేయవచ్చు, ఈ పని చేయరాదనే దిశానిర్దేశమే ప్రవర్తనా నియమావళి.

ఈ ప్రవర్తనా నియమావళి (MCC) ఎన్నికల షెడ్యూలు రాష్ట్రపతి, గవర్నరులు ప్రకటించగానే అమలులోనికి వస్తాయి.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఏం చేయరాదో, ఏం చేయవచ్చునో తెలుసుకొనేముందు, ప్రవర్తనా నియమావళిని అమలుపరిచే ముఖ్యమైన వ్యవస్థల గురించి కొంచెం తెలుసుకొంటే, ముందుముందు సందర్భోచితంగా ఉంటుంది.

కేంద్ర ఎన్నికల కమీషన్ చే నియమింపబడిన అబ్జర్వరు (observer) ఉంటారు.ఇతను ECI వారికి మాత్రమే జవాబుదారి. పార్లమెంటుకు వేరుగా, నియోజకవర్గాలకు వేరుగా ఉంటారు.ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలించి నివేదిక ECI వారికి ఇస్తాడు.

(1)District Control cell . జిల్లా కేంద్రంలో DE0 అనగా District Election officer అధ్వర్యంలో 24x7 పని చేస్తుంది.ఒక అధికారి ఇద్దరు లేదా ముగ్గురు సిబ్బంది ఉంటారు. టోల్ ఫ్రీ నెంబరులు 3-4 లైన్ల కలిగి వుంటుంది.వాటికి వచ్చే ఫిర్యాదులు సూచనలు రిజిస్టరు చేసుకొని సంబంధిత అధికారులకు చర్యలకు వెంటనే పంపిస్తారు.

(2) ఎన్నికల వ్యయ విభాగం (Expenditure monitering cell). ఇందులో కేంద్ర ఎన్నికల సంఘంచే నియమించబడిన వ్యయపరిశీలకుడు (Expenditure obsesever = E0), ఒక అసిస్టెంటు ఎక్స్ పెండెచర్ అబ్జర్వరు =AE0, ఇతర సిబ్బంది ఉంటారు.

(3) ప్లయింగ్ స్క్వాడ్. (Flying Squad = FS) ఒక మేజిస్ట్రేట్ స్థాయి అధికారి, పోలీస్ అధికారులు, సిబ్బంది, విడియోకెమెరా మేన్ ఉంటారు.

(4) స్టాటిక్ సర్వేలియన్స్ టీం (static surveilliance Team =SST ).స్టాటిక్ అనగా స్థిరమైనది అని అర్ధం.Static surveillance అనగా check post Team అనుకోవచ్చు. సరిహద్దులలోనూ, ఇతర ముఖ్య ప్రదేశాలలో ఏర్పాటు చేస్తారు. ఒక మేజిస్ట్రేట్ స్థాయి అధికారి, పోలీసు సిబ్బంది, ఇతర సిబ్బంది, విడియోకెమెరామేన్ కలిగి ఉండాలి.

(5) విడియో సర్వేలియన్స్ టీం.video surveilliance Team = VST ) ఇందులో విడియో కెమెరామేన్ తో కలిసి ఇద్దరు సిబ్బంది ఉంటారు.

ఎన్నికలంటేనే నేనే గెలవాలనే స్పర్ధతో ( competition) రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ఉంటారు. అందుకొసం చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడతారు. అందుకే " వ్యక్తులలో నైతిక పరివర్తన రానిదే ప్రజాస్వామ్యం విజయవంతం కాదని " గాంధీ మహత్ముడు పేర్కొనాడు.

గెలవటానికి
విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడతారు. ఓటర్లను ప్రలోభపెట్టటానికి చీరలు, కమ్మలు, స్టౌలు, బిందెలు, టీషర్టులు, సెల్ ఫోన్లు, టీవీలు వంటివి పంచుతారు. మద్యం ఏరులై ప్రవహిస్తుంది. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తారు.
ఓటు కొరకు మతాన్ని, కులాన్ని రెచ్చగొడతారు.

ఇలా ఎవరు చేస్తారు?
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వ్యక్తులకు. 

మంత్రులు అధికారిక హోదాతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదు. అధికారిక వాహనాలను, సిబ్బందిని ప్రచారంలో ఉపయోగించరాదు. అటువంటి వాహనాలను ఇంటికి కార్యాలయానికే పరిమితం చేయాలి.
Pilot, escort వాహనాలు వాడరాదు.Security లేదా భద్రతాపరమైన కారణాలుంటే ECI అనుమతి తీసుకోవాలి.

MCC అమలులోనికి రాగానే సిబ్బంది బదిలీలు, ప్రమోషన్లు, కొత్త నియమాకాలు చేయరాదు.కార్పోరేషన్లు మొదలైనవాటికి డైరక్టర్లును, ఛైర్మన్లను నియమించరాదు.

అధికారులెవరు వ్యక్తిగత కారణంతోకాని. అధికారిక హోదాలోని కారణంచేతకాని ప్రజా ప్రతినిధులను కలువరాదు.

ప్రభుత్వం నిర్వహించే పండుగలలో ( ఉదా॥ ఇండిపెండెన్స్ డే), అంబేద్కరు జయంతి,కవి సమ్మేళనాలు, ఉగాది వేడుకలు, ఇప్తారువిందులలో పాల్గొన్నప్పటికి అందులో ఎన్నికల ప్రచారం చేయరాదు.

ప్రభుత్వఖర్చుతో జరిగిన అభివృద్ధిపనుల గురించి ప్రకటనలు ఇవ్వరాదు. ఎలాంటి గ్రాంటులు, సంక్షేమ కార్యక్రమాల చెల్లింపులు చేయరాదు. కొత్తగా పనులు చేపట్టరాదు, అనుమతులు ఇవ్వరాదు.అవసరమైతే ECI వారి అనుమతి తీసుకోవాలి.

గిట్టుబాటు ధరల గురించి, ఖైదీల విడుదల గురించి, జీతభత్యాల పెంపు గురించి, NGOలకు నిధుల విడుదల మొ॥వాటి గురించి ప్రకటనలు చేయరాదు.

ప్రతిపక్షమైనా, స్వపక్షమైనా సంఘంలో సున్నితమైన అంశాల గురించి రెచ్చగొట్టరాదు.

కులం,మతం, భాష, ప్రాంతం, జాతీ, రంగు గురించి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించరాదు.

కులం, మతం, జాతి, ప్రాంతం, రంగు గురించి ప్రసంగిస్తూ ఓట్లను అడుగరాదు.

దేవాలయాలలో, గురుద్వారాలలో, జైన బసదులలో, బుద్ధచైత్యాలలో, మసీదు, చర్చి వంటి ప్రార్ధనా మందిరాలలో ప్రచారం చేయరాదు.

నామినేషన్లు వేయటానికి పెద్దపెద్ద ఊరేగింపులు చేస్తూ IPC 144 వంటి నిషేదాజ్ఞలు ఉన్న ప్రదేశాలలో వెళ్ళరాదు. ఆస్పత్రులు, పాఠశాలలు, దేవాలయాల వద్ద శబ్దకాలుష్యం కల్గించరాదు. ట్రాఫిక్ కు అంతరాయం కలగించరాదు.

నామినేషన్ వేయటానికి మూడు వాహనాలలో వెళ్ళి రిటర్నింగ్ అధికారి (RO Office) కార్యాలయానికి వందమీటర్ల దూరంలోనే వాహనాలు ఆపి 1+4 = 5 మంది మాత్రమే R0 ఆఫీసులోనికి వెళ్ళాలి.

ప్రచారంలో అభ్యర్ధివాడే వాహనాలపై పరిమితిలేదు.ప్రతి వాహనానికి R0 చే అనుమతిపత్రం తీసుకోవాలి.అసలు కాపీని మాత్రమే వాహనం యొక్క wind Screen పై అతికించాలి. జిరాక్స్ కాపీలు చెల్లవు.

ప్రభుత్వస్థలాలలో, కార్యాలయాలలో ప్రచారం నిషిద్ధం. ప్రభుత్వ స్థలాలలో, ప్రభుత్వభవంతులను Defacement వాస్తవరూపాన్ని మారుస్తూ స్లోగన్లు వ్రాయరాదు. పోస్టర్లు అతికించరాదు. బ్యానర్లు, ప్లెక్సీలు, హోర్డింగ్ లు ప్రదర్శించరాదు.

వ్యక్తిగత బిల్డింగ్ లపై R0 చే అనుమతివుంటేనే ప్రచారసామాగ్రితో ప్రదర్శనలు చేసుకోవచ్చును.

అభ్యర్ధులు స్వంతఖర్చుతో టోపీలు, స్కార్పులు, మాస్కులు పంచవచ్చును. అయితే చీరలు, దోవతులు, బంగారం, ఇతర వస్తువులు, డబ్బు, మద్యం పంచరాదు.

Paid news ఇవ్వరాదు. TV లలో, రెడియోలలో, పత్రికలలలో ప్రచారం చేసుకోవచ్చును.
డైరీలు, క్యాలండర్లు, స్టిక్కర్లు ముద్రించి పంపిణీ చేయరాదు. అలా చేస్తే bribery ( లంచగొండితనం) క్రింద నేరము.

అభ్యర్థులు తాత్కాలిక కార్యాయాలు ఏర్పాటుచేసుకోవచ్చును. అయితే గుడులు, బడులు, ఆసుపత్రులు, పోలింగ్ స్టేషన్లకు 200 mtrs దూరంలోనే ఏర్పాటు చేయాలి.శబ్ధకాలుష్యం ఉండరాదు.

పోలీసుల, R0ల అనుమతితోనే సభలు, సమావేశాలు నిర్వహించరాదు.

లౌడ్ స్పీకర్లు రాత్రి పది తరువాత ఉదయం 6.00 గంటలకు ముందు పని చేయరాదు.అలాగే సభలు-సమావేశాలు రాత్రి పది తరువాత ఉదయం ఆరు గంటలకు ముందుగా ఉండరాదు.

పోలింగ్ కు 48 గంటల ముందుగా ఎన్నికల ప్రచారాన్ని తప్పనిసరిగా ఆపాలి.

ఎన్నికలలలో  మద్యం తయారీ, పంపిణి ఉండరాదు. పోలింగ్ నాటికి 24 గంటల ముందుగా మద్యం దుకాణాలు మూతపడాలి.

పోలింగ్ ముందునాటికే ECI ద్వారా ఓటర్లకు ఓటరుస్లిప్పుల పంపిణి జరిగివుంటుంది. అయితే అభ్యర్థులు మేము కూడా స్లిప్స్ లు ఇస్తామంటే అభ్యంతరం లేదు. అటువంటి స్లిప్పులు తెల్ల కాగితం మీదనే ఓటరు పేరు, పోలింగ్ స్టేషన్ పేరు, ఓటరు  సిబ్బందికి,ఓటరుకు, పోలింగ్ ఏజంట్లకు, అభ్యర్ధికి, ఎలెక్షన్ ఏజంట్ కు, Microobserverకు, observerకు, Sectoral Officers కు, ECI వారి అనుమతివున్న విలేకరులకు, ఓటు వేయటానికి అంధులకు, వికలాంగులకు అనుమతి ఇవ్వబడిన సహయకులకు మాత్రమే అనుమతి ఉంటుంది.

పోలింగ్ రోజున ఓటర్ల రవాణాకు వాహనాలు ఉపయోగించడం నిషిద్ధం. ఆయుధాలకు ప్రవేశంలేదు.

c - Vigil ద్వారా వచ్చిన ఫిర్యాదులపైనే కాకుండా Flying Sqaud, Video Surveiliance Teams, Static surveliance Teams, Asst Expenditure observer, RO, పోలీస్ సిబ్బంది సభలు-సమావేశాలు, ఊరేగింపులు, మేళాలు Defacement of Public Property వంటి వాటిపై దృష్టి సారించాలి.

Model Code of conductను ఉల్లంఘిస్తే శిక్షలున్నాయి. (Corrupt practices - అవినీతికరమైన చర్యలకు)

1951 ప్రజాప్రాతినిథ్య చట్టం (Representation of the people Act-1951) ప్రకారం.

సెక్షన్ 123 (1)..
ఓటర్లను ప్రలోభపెట్టడం, భయపెట్టడం, లంచం ఇవ్వడం తీసుకోవడం,
కులం,మతం,జాతి,ప్రాంతం, రంగు, వర్గాలను ఉపయోగించి ఓట్లు అడగటం, కులం, మతం, జాతి, ప్రాంతం, వర్గం, రంగు అనే అంశాలతో ప్రజలమధ్య బేధాభిప్రాయాలు కల్లించడం, ఎన్నికలలో జాతీయ చిహ్నాలు ఉపయోగించడం,
ఎదుటివ్యక్తి,వ్యక్తిగతవిషయాలను విమర్శించడం,
ఓటర్ల రవాణాకు స్వంతలేదా అద్దెవాహనాలు ఉపయోగించడం.
నిర్ణీతపరిధి కంటే ఎక్కువగా డబ్బుఖర్చుచేయడం.
ప్రభుత్వ సేవలను బలవంతంగా పొందడం.

సెక్షన్ 125
ఎన్నికలలో ప్రజలలో శత్రుత్వం కల్గించడం.

సెక్షన్ 126
ప్రభుత్వానికి చెందిన ప్రదేశాలలో, నిషేధిత ప్రాంతాలలో ప్రచారం చేయడం.

సెక్షన్ 127
ఇతరుల ఎన్నికల సమావేశాలను భంగపరిచే చర్యలు చేపట్టడం.

సెక్షన్ 127 A
కరపత్రాలు, పోస్టర్లపై నియంత్రణ లేకపోవడం.

సెక్షన్ 128
రహస్య ఓటింగ్ పద్ధతికి భంగం కల్పించడం.

సెక్షన్లు 130, 131, 132
పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రచారం చేయడం.పోలింగ్ స్టేషన్ల వద్ద క్రమశిక్షణా లేకుండా తిరగటం,హద్దుమీరి ప్రవర్తించడం.

సెక్షన్ 133 
ఓటర్ల చేరవేతకు వాహనాలు ఉపయోగించడం.

సెక్షన్ 134 B
పోలింగ్ స్టేషన్ పరిధిలో ఆయుధాలు కలిగఉండటం.

సెక్షన్లు 135, 135 A, 136.
పోలింగ్ స్టేషన్లును ఆక్రమించడం, పోలింగ్ స్టేషన్ల నుండి  ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ( EVMs) పోలింగ్ స్టేషన్ ను తొలగించడం. EVMs, బ్యాలట్ పేపర్లు, ఇతర రికార్డులు నాశనం చేయడం.

సెక్షన్ 135 C
పోలింగ్ రోజున మద్యం అమ్మడం, సరఫరా, పంపిణి చేయడం నేరం.

అదేవిధంగా 1860నాటి భారత శిక్షాస్ర్మతి (indian Penal Code - 1860.) ప్రకారం.

సెక్షన్ 171 B
లంచగొండితనం.

సెక్షన్ 171 C
ఓటర్లను సిబ్బందిని ప్రలోభపెట్టడం.

సెక్షన్171 C
మోసం చేయాలనే ఉద్దేశ్యంతో మరో వ్యక్తిలా ప్రవర్తించడం.( personation).

సెక్షన్171 G
ఎన్నికలకు సంబంధించి Fales Statements / అసత్య ప్రచారాలను చేయడం..

సెక్షన్లు, 172 H,172 i
ఎన్నికలలో నిధులను చట్టవిరుద్ధంగా ఖర్చు పెట్టడం, ఎన్నికలలో ఖర్చుపెట్టిన నిధులకు లెక్కలు చూపకపోవడం నేరం .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad