Type Here to Get Search Results !

భారత రత్న పురస్కారాలు

0
భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం భారతరత్న.ఈ అవార్డుని 1954 సంవత్సరంలో ప్రారంభించారు.ఈ అవార్డును జనవరి 26(గణతంత్రదినము)న ప్రధానం చేస్తారు.ఈ అవార్డును కళలు,శాస్త్ర సాంకేతిక రంగం,ప్రజాసేవ,ప్రభుత్వ సేవా రంగాలలో కృషి చేసిన వ్యక్తులకు ప్రధానం చేస్తారు.

భారతరత్న అవార్డును 1977 సంవత్సరంలో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రద్దు చేసారు.


  • ఈ అవార్డును తిరిగి 1980 సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం పునఃప్రారంభించింది.
  • ఈ అవార్డును సంవత్సరానికి గరిష్టంగా ముగ్గురికి ఇవ్వడం జరుగుతుంది.
  • ఈ అవార్డును ఇప్పటి వరకు 45 మందికి ప్రధానం చేసారు.
  • ఇప్పటి వరకు 5 గురు మహిళలకు భారతరత్న అవార్డు లభించింది.
  • 2011 లో భారతరత్న పరిధిని క్రీదారంగంతో సహా అన్ని రంగాలకు విస్తరించింది.
  • భారతరత్న,పద్మ అవార్డులు రాజ్యాంగంలో 18 వ అధికరణలో వివరించబడ్డాయి.
  • భారతరత్న అవార్డుల ఎంపిక కమిటీకి చైర్మన్ - ఉపరాష్ట్రపతి


ముఖ్యాంశాలు :


  1. భారతరత్న అవార్డు పొందిన మొట్ట మొదటి వ్యక్తీ - సి.రాజగోపాలాచారి(రాజాజీ).
  2. భారతరత్న అవార్డు పొందిన మొట్ట మొదటి మహిళ - శ్రీమతి ఇందిరాగాంధీ.
  3. భారతరత్న అవార్డును మరణానంతరం పొందిన మొట్ట మొదటి వ్యక్తీ - లాల్ బహదూర్ శాస్త్రి.
  4. భారతరత్న అవార్డును మరణానంతరం పొందిన మొట్ట మొదటి మహిళ - అరుణా అసఫ్ అలీ.
  5. భారతరత్న అవార్డు పొందిన మొట్ట మొదటి విదేశీయుడు - ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్.
  6. భారతరత్న పొందిన మొట్ట మొదటి క్రీడాకారుడు - సచిన్ టెండూల్కర్(2013).
  7. భారతరత్న పొందిన పిన్న వయస్కుడు - సచిన్ టెండూల్కర్(40 సంవత్సరాలకు).
  8. భారతరత్న పొందిన మొదటి రాష్ట్రపతి - బాబు రాజేంద్రప్రసాద్(1961).
  9. భారతరత్న పొందిన మొదటి ఉపరాష్ట్రపతి - ఎస్.రాధాకృష్ణన్(1954).
  10. భారతరత్న పొందిన మొదటి ప్రధాని - జవహర్ లాల్ నెహ్రు(1955).
  11. భారతరత్న పొందిన మొదటి మరియు ఏకైక సినిమా నటుడు - ఎం.జి.ఆర్(1988).
  12. భారతరత్న పొందిన మొదటి సినిమా దర్శకుడు - సత్యజిత్ రే(1992).
  13. భారతరత్న పొందిన మొదటి సంగీత వేత్త - ఎం.ఎస్.సుబ్బలక్ష్మి(1998).
  14. 100 వ పుట్టిన రోజున భారతరత్న పొందినది - డి.కె.కార్వే(సంఘ సంస్కర్త)1958.
  15. భారతరత్న పొందిన మొదటి శాస్త్రవేత్త - సి.వి.రామన్(1954)


భారతరత్న పొందిన శాస్త్రవేత్తలు ముగ్గురు :


  • సి.వి.రామన్(1954)
  • ఎ.పి.జె అబ్దుల్ కలాం(1997)
  • సి.ఎన్.ఆర్.రావు(2013)


భారతరత్న ,నోబెల్ రెండు అవార్డులు పొందిన భారతీయులు :

సి.వి.రామన్(1954)
మథర్ థెరిస్సా(1980)
అమర్త్యసేన్(1998)
భారతరత్న,ఆస్కార్ రెండూ పొందినది : సత్యజిత్ రే

భారతరత్న మెడల్ వివరాలు :


  • భారతరత్న మెడల్ రావి పత్రము ఆకారంలో ఉండి కంచు పూత కలిగి ఉంటుంది.
  • మెడల్ కి ఒక వైపు ప్రకాశిస్తున్న సూర్యుని బొమ్మ ,దేవనాగరి లిపిలో భారతరత్న అని వ్రాయబడి ఉంటుంది.
  • మెడల్ కి రెండవ వైపు భారత జాతీయ చిహ్నం, దేవనాగరి లిపిలో వ్రాయబడిన సత్యమేవజయతే అనే సూక్తి ఉంటుంది.


గమనిక : 1992 లో సుభాష్ చంద్రబోస్ కు భారతరత్న



గ్రహీతసంవత్సరం
1.సి.రాజగోపాలా చారి1954
2.సర్వేపల్లి రాధాకృష్ణన్1954
3.సి.వి.రామన్1954
4.జవహర్ లాల్ నెహ్రు1955
5.భగవాన్ దాస్1955
6.మోక్షగుండం విశ్వేశ్వరయ్య1955
7.గోవింద్ వల్లభ్ పంత్1958
8.డి.కె కార్వే1958
9.బి.సి రాయ్1961
10.పురుషోత్తమ దాస్ టాండన్1961
11.బాబూ రాజేంద్రప్రసాద్1961
12.జాకీర్ హుస్సేన్1963
13.సి.వి. కానే1963
14.లాల్ బహుదూర్ శాస్త్రి1966
15.శ్రీమతి ఇందిరాగాంధీ1971
16.వి.వి.గిరి1975
17.కె.కామరాజ్ నాడార్1976
18.మధర్ థెరిస్సా1980
19.ఆచార్య వినోభా బావే1983
20.ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్1987
21.యం.జి.రామచంద్రన్1988
22.బి.ఆర్.అంబేద్కర్1990
23.నెల్సన్ మండేలా1990
24.రాజీవ్ గాంధీ1991
25.సర్దార్ వల్లభాయ్ పటేల్1991
26.మొరార్జీ దేశాయ్1991
27.జె.ఆర్.డి.టాటా1992
28.మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్1992
29.సత్యజిత్ రే1992
30.గులార్జీలాల్ నందా1997
31.అరుణా అసఫ్ అలీ1997
32.ఎ.పి.జె.అబ్దుల్ కలాం1997
33.m.s.సుబ్బలక్ష్మి1998
34.సి.సుబ్రహ్మణ్యం1998
35.జయప్రకాష్ నారాయణ1998
36.ఆమర్త్యసేన్1998
37.పండిత్ రవిశంకర్1999
38.గోపీనాథ్ బార్దోలియా1999
39.బిస్మిల్లాఖాన్2001
40.లతా మంగేష్కర్2001
41.పండిత్ భూమ్ సేన్ జోషి2008
42.చింతామణి నాగేశ రామచంద్రరావు2013
43.సచిన్ రమేష్ టెండూల్కర్2013
44.మదన్ మోహన్ మాలవీయ2014
45.అటల్ బిహారీ వాజపేయి2014

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad