Type Here to Get Search Results !

ప్రాథమిక హక్కులు

0

ప్రాథమిక హక్కులు > భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో పేర్కొన్నరు?
> మూడవ భాగంలో ఏయే నిబంధనలు ప్రాథమిక హక్కుల గురించి  పేర్కొంటున్నవి?
> ఆర్టికల్ 12 నుంచి 35 నిబంధనలు

ఆర్జికల్ 12 దేనిని గురించి పేర్కొంటుంది?

రాజ్యం గురించి నిర్వచిస్తుంది ప్రాథ మిక హక్కులకు వ్యతిరేకమైన చట్టాలు చెల్లనేరవు అని చెప్పే నిబంధన ఏది?
- ఆర్టికల్ 13 >

న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం అందించే నిబంధన ?
ఆర్టికల్ 18

భారతదేశంలో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసే అధికారం?
అత్యవసర పరిస్థితి సమయంలో రాష్ట్రపతి తాత్కాలికంగా రద్దు చేయగలరు.

ప్రాథమిక హక్కులపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది?
- పార్లమెంట్ >

భారత రాజ్యాంగం ప్రస్తుతం ఎన్ని రకాల ప్రాథమిక హక్కులను కల్పిచింది? -
_6 రకాలు అవి
1. సమానత్వపు హక్కు
2. స్వేచ్చా స్వాతంత్ర్యపు హక్కు
3. పీడనను నిరోధించే హక్కు
4. మత స్వేచ్చా హక్కు
5. విద్యా, విషయక సాంస్కృతిక హక్కు
6. రాజ్యాంగ పరిహారపు హక్కు

 సమానత్వపు హక్కు (ఆర్టికల్ 14నుంచి 18):
ఆర్టికల్ 14: చట్టం ముందు అందరూ సమానులే మినహాయింపు: రాష్ట్రపతి, గవర్నర్లకు దీని నుంచి మినహాయింపులు వర్తిస్తాయి.

ఆర్టికల్ 15: జాతి, కుల, మత, లింగ, జన్మ లేదా ప్రాంతీయ అనే 5 రకాల వివక్షతలు నిషేధం - భారతదేశంలో ఈ ఐదు రకాల వివక్షతలు చూపరాదు. ప్రభుత్వంకూడా ఈ వివక్షతల ఆధారంగా అవకాశాలు నిరాకరించటం చేయరాదు.

ఆర్టికల్ 16: కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాల్లో అందిరికీ సమాన సమాన అవకాశాలు - కాని వెనుకబడిన వర్గాల వారికి, మహిళలకు ప్రత్యేకంగా ఇచ్చే అవకాశాలను వివక్షగా భావించరాదు. ప్రభుత్వం వెనుకబడిన వర్గాల వారికి
ఉద్యోగ అవకాశాల విషయంలో రిజర్వేషన్లకు వెసులుబాటు ఉంది.

ఆర్టికల్ 17: అస్పృశ్యత నిషేధం - ఈనిబంధన నిరపేక్షమైనది. అంటరానితనం పాటిస్తే 1976 పౌర హక్కుల ప్రకారం శిక్షార్హులు అవుతారు. ఈ చట్టం ప్రకారం అస్పృస్యత పాటిస్తే ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హులు.

ఆర్టికల్ 18: బిరుదులు నిషేధం స్వేచ్ఛాస్వాతంత్ర్యపు హక్కు

ఆర్టికల్ 19: ఆరు రకాల వ్యక్తిగత స్వేచ్ఛలు పేర్కొంటుంది.
19(1ఎ) భావ వ్యక్తీకరణ స్వేచ్చ
19(1బి) ఆయుధాలు ధరించకుండా శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం
19(12) ఒక సమూహంగా ఏర్పడి సంఘాలు ఏర్పాటు చేసుకోవటం
19 (1డి): . దేశంలో ఏ ఏ ప్రాంతంలోనైనా సంచరించే స్వేచ్చ
19 (1ఎఫ్): దేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ

గమనిక:
1.. పైన చెప్పిన నిబంధనలకు కొన్ని పరిమితులు కూడా ఉంటాయి.
2. 19 (19)- ఆస్తిని సంపాదించటం, ఖర్చు చేయుట అనే నిబంధనను తొలగించి 12 వ భాగంలో 300ఏ నిబంధనలో
చేర్చటం జరిగింది.
ఆర్టికల్ 20: చట్టం నుంచి రక్షణ పొందే హక్కు - ఒక వ్యక్తి చేసిన పని చట్ట పరంగా నేరం అయితేనే శిక్షించాలి. - ఒక నేరానికి ఒకసారి మాత్రమే శిక్ష విధించాలి

- అరెస్టు చేసిన వ్యక్తికి కారణం తెలియచేయాలి. - అరెస్టు చేసినవ్యక్తిని 24 గంటల్లోగా సమీప కోర్టులో హాజరు పరచాలి. - తనను తాను వాదించుకునే వీలు లేదా న్యాయవాది సౌకర్యం కల్పించాలి.

గమనిక: దేశంలో అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు వెంటనే రద్దు అయ్యే నిబంధన ఆర్టికల్ 19.- ఎలాంటి పరిస్థితిల్లోనూ, ఎప్పటికీ రద్దుకాని నిబంధన ఆర్టికల్ 20, 21.

ఆర్టికల్ 23: మనుషుల క్రయ విక్రయాలు నిషేదం, వెట్టిచాకిరి నిషేదం -జోగిని, మాతాంగి, దేవదాసి, స్త్రీలను అగౌర్వ పరచటం వంటిచర్యలు నిషేదం

ఆర్టికల్ 24: బాల కార్మిక వ్యవస్థ నిషేదం- 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న బాలబాలికలతో పనులు చేయించటం, ప్రమాదకర గనులలో పనిచేయించటం నిషేదం. మతస్వేచ్చ హక్కు

ఆర్టికల్ 25: పౌరులు వారి ఆత్మరాత్మ ప్రభోదానుసారం తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, పాటించవచ్చు.

ఆర్టికల్ 26: మతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, మతాభివృద్ధికి సంస్థలు స్థాపించుకోవచ్చు.

ఆర్టికల్ 27: మతం పేరుతో బలవంతంగా పన్నులు వసూలు చేయటం నిషేదం. ప్రభుత్వ విద్యాలయాలు, ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న విద్యాలయాలలో మతబోధ నిషేధం

ఆర్టికల్ 29: అల్ప సంఖ్యాక వర్గాల వారు తమ భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునే స్వేచ్ఛ

ఆర్టికల్ 30: అల్ప సంఖ్యాక వర్గాల వారు తమ బాష, లిపి, సంస్కృతిని పరిరక్షించుకునేందుకు సంస్థలు స్థాపించుకోవచ్చు.

ఆర్టికల్ 32: ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులు ఐదు రకాల రిట్లు జారి చేసి వాటిని పరిరక్షిస్తాయి. అవి 
1. హెబియస్ కార్పస్ 
2. మాండమస్ 
3. ప్రొహిబిషన్ 
4. కోవారెంట్ 
5. సెర్షియోరరి
5 రకాల రిట్లు హెబియస్ కార్పస్: నిర్బంధించిన వ్యక్తిని 24గంటల్లో కోర్టుకు హాజరు పరచాలని కోర్టు జారీ చేసే ఆజ్ఞ. మాండమస్: మేము ఆజ్ఞాపిస్తున్నాం అని అర్థం.

ఎవరైనా ప్రభుత్వ అధికారి తమ ప్రాథమిక బాధ్యతను విస్మరించినప్పుడు వాటిని నిర్వర్తించాలని కోర్టు జారీ చేసే
వారాంటో: ఏ అధికారంతో అని అర్థం, ఒకవ్యక్తిగాని, సంస్థగానీ అధికారాలు చెలాయిస్తుంటే ఏ అధికారంతో చెలాయిస్తున్నారు అని కోర్టు జారీచేసే రిట్టు.. 

ప్రొహిబిషన్: దిగువ కోర్టు తన అధికార పరిధిలోలేని విషయాన్ని గురించి విచా రిస్తున్నప్పుడు దానిని నిలిపి వేయాలని హైకోర్టు కింది కోర్టుకుజారీ చేసేరిట్. 

సెర్షియోరరి: ఇది కూడా కింది కోర్టులు లేదాట్రిభ్యునళ్లకు పై కోర్టు జారీ చేస్తుం ది. కింది కోర్టులు లేదా ట్రిబ్యు నళ్లు వెలువరించిన ఉత్తర్వులను రద్దు చేసి బదిలీ చేయడానికి దీనిని జారీ చేస్తారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad